గెలుపు వాకిట్లో శశి థరూర్
తిరువనంతపురంలో విక్టరీ
కేరళ – కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, వక్త, రచయిత , విశ్లేషకుడు శశి థరూర్ రికార్డ్ సృష్టించారు. ఆయన మూడోసారి తిరువనంతపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పై గ్రాండ్ విక్టరీ నమోదు చేయడం విశేషం.
ఈ స్థానానికి ఏప్రిల్ 26న రెండో దశలో పోలింగ్ జరిగింది. ఇక్కడ రాజీవ్ చంద్రశేఖర్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు జరిగిన హోరా హోరీ పోరులో ఎట్టకేలకు శశి థరూర్ తన సత్తా ఏమిటో చూపించారు. ఆయన ఈ విజయాన్ని సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
రాజీవ్ చంద్రశేఖర్ పై 17,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించడం విశేషం. ఇక 400 సీట్లు వస్తాయని పదే పదే ప్రచారం చేసిన మోడీకి కూడా షాక్ తగిలింది. ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగింది. మేధావిగా గుర్తింపు పొందారు శశి థరూర్. ఆయన విజయంతో తిరువనంతపురం ప్రజలకు రుణపడి ఉన్నానని ప్రకటించారు.