టీటీడీకి భూమన గుడ్ బై
నా రాజీనామా ఆమోదించండి
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అధికారికంగా లేఖను విడుదల చేశారు. నేరుగా టీటీడీ కార్య నిర్వహణ అధికారి (ఈవో) ఏవీ ధర్మా రెడ్డికి అందజేశారు.
ఇదిలా ఉండగా గత ఆగస్టు నెలలో టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు కరుణాకర్ రెడ్డి. వైసీపీ ఏపీలో కొలువు తీరిన తర్వాత తిరుమల పుణ్య క్షేత్రం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంది. అన్యమతస్తులు ఎక్కువగా అపవిత్రం చేసేందుకు ప్రయత్నం చేశారన్న విమర్శలు ఉన్నాయి.
ప్రధానంగా టీటీడీలో ఈవో వ్యవహారంపై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన వచ్చాక పూర్తిగా రాజకీయంగా మార్చేశారంటూ భక్తులు తీవ్రంగా ఆరోపించారు. కోట్లాది మంది భక్తులను కలిగిన కలియుగ పుణ్య క్షేత్రాన్ని భ్రష్టు పట్టించారంటూ విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా కొండపైన ఒకే ఒక్క అన్నదాన సత్రం ఉండడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.