ప్రజా తీర్పును శిరసావహిస్తాం
విజయ సాయి రెడ్డి కామెంట్
అమరావతి – వైసీపీ సీనియర్ నాయకుడు విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వెల్లడైన ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను , కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీడీపీ కూటమికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారని ఎవరైనా సరే గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. తమ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగే కీలక సమావేశంలో ఎందుకు ఓటమి చెందానే దానిపై సమీక్షించు కుంటామని చెప్పారు.
నెల్లూరులో విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. కానీ ఎందుకనో ప్రజలు తమను పట్టించుకోక పోవడం విస్తు పోయేలా చేసిందన్నారు.
ఏది ఏమైనా ప్రజా తీర్పును తప్పక స్వీకరిస్తామని, ఆ విజ్ఞత తమకు ఉందని స్పష్టం చేశారు విజయ సాయి రెడ్డి.