నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్
కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ కు షాక్
అమరావతి – ఏపీలో ఎన్నికల ఫలితాలు పూర్తయ్యాయి. దేశ చరిత్రలోనే అద్భుతమైన తీర్పు చెప్పారు. భారీ ఎత్తున టీడీపీ కూటమి ఊహించని రీతిలో సీట్లు పొందాయి. అటు అసెంబ్లీలో ఇటు లోక్ సభలో దుమ్ము రేపింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఊహించని తీర్పు ఇది.
ఇక రాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడం రికార్డ్ అని చెప్పక తప్పదు. గూడూరులో పాశం సునీల్ కుమార్ 19,915 ఓట్లతో గెలుపొందగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 15,999 ఓట్లతో విజయం సాధించారు.
కోవూరులో 49,996 ఓట్లతో ప్రశాంతి రెడ్డి మెజారిటీతో విక్టరీ పొందారు. ఇక ఆత్మకూర్ నియోజకవర్గంలో ఆనం రామ నారాయణ రెడ్డి 7, 106 ఓట్లతో గెలుపొందారు. నెల్లూరు రూరల్ లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి 31, 971 ఓట్లతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించడం విశేషం.
వేంకటగగిరి నియోజకవర్గంలో కురుగొండ్ల రామకృష్ణ 15, 454 ఓట్లతో గెలుపొందగా సూళ్లూరుపేటలో డాక్టర్ నెలపల విజయశ్రీ 29,115 ఓట్లతో , నెల్లూరులో నారాయణ 70 వేల 513 ఓట్లతో , కావలిలో వెంకట కృష్ణా రెడ్డి 29, 700 ఓట్లతో , ఉదయగిరిలో 9,566 ఓట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు.