గెలుపు బాధ్యతను పెంచింది – బండి
నమ్మకం ఉంచినందుకు రుణపడి ఉన్నా
కరీంనగర్ జిల్లా – ఈ విజయం తనపై మరింత బాధ్యతను పెంచిందని స్పష్టం చేశారు కరీంనగర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి మరోసారి గెలుపొందిన బండి సంజయ్ కుమార్ పటేల్ . విజయం సాధించిన అనంతరం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తమ నాయకుడు , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆమోదించారని , అద్బుత విజయాన్ని అందజేసినందుకు భారతీయులందరికీ రుణపడి ఉన్నామని పేర్కొన్నారు ఎంపీ. ఈ మేరకు తన గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్క పార్టీకి చెందిన నాయకులకు, కార్యకర్తలకు, శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.
తనను మరోసారి పార్లమెంట్ కు పంపించినందుకు , ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పినందుకు , కాషాయానికి ఢోకా లేదని నిరూపించినందుకు తాను థ్యాంక్స్ చెబుతున్నట్లు స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్.
కుటుంబాలను వదిలి తమ ఉద్యోగ, వ్యాపారాలను పక్కన బెట్టి…కమల విజయ వికాసం కోసం అహర్నిశలు శ్రమించిన వారందరికి రుణపడి ఉంటానని అన్నారు.