ప్రత్యర్థులు కలిసిన వేళ
న్యూఢిల్లీ – దేశంలో ఎన్నికల ఫలితాలు ముగిసినా ఇంకా రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. 543 సీట్లకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ ను చేరుకోలేక పోయింది మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి. ఇక ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి సైతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ప్రయత్నాలను ప్రారంభించింది. దీంతో దేశ రాజకీయం మొత్తం ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతోంది.
నిన్నటి దాకా అంతగా ప్రాధాన్యత లేకుండా ఉండి పోయిందిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ , టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సెంటర్ ఆఫ్ర అట్రాక్షన్ గా మారారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి కావాలన్నది నితీశ్ కోరిక. దీనిని ఎన్డీయే ముందు పెట్టే అవకాశం ఉందని టాక్. ఇదిలా ఉండగా బీహార్ నుండి ఢిల్లీకి చేరుకునేందుకు ఫ్లైట్ ఎక్కారు.
విచిత్రం ఏమిటంటే నిన్నటి దాకా కలిసి పని చేశారు నితీశ్ కుమార్ , మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. ఈ ఇద్దరూ వేర్వేరు కూటములకు చెందిన నేతలు కావడం విశేషం. ఇద్దరూ ఒకే విమానాంలో ప్రయాణం చేయడం, ఆప్యాయంగా పలకరించు కోవడం చర్చనీయాంశంగా మారింది.