NEWSTELANGANA

జ‌నం మోడీని తిరస్క‌రించారు

Share it with your family & friends

ఇక ఆయ‌న రాజీనామా చేస్తే బెట‌ర్
హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించారు. ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చార‌ని, ఇవాళ 400 సీట్లు వ‌స్తాయ‌ని బాకాలు ఊదిన భార‌తీయ జ‌న‌తా పార్టీని, మోడీని తిర‌స్క‌రించార‌ని అన్నారు. ఇక‌నైనా అధికారం శాశ్వ‌తం కాద‌ని గుర్తిస్తే మంచిద‌న్నారు రేవంత్ రెడ్డి.

ఆయ‌న‌కు వ‌చ్చే ఏడాదితో 75 ఏళ్లు పూర్త‌వుతాయ‌ని, ఇక బీజేపీ ఇప్ప‌టికే తీర్మానం చేసింద‌ని, వ‌య‌సు అయి పోయిన వారు ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకోవాల‌ని ఈ తీర్మాణానికి మోడీ క‌ట్టుబ‌డి ఉండాల‌ని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇంత కాలం బీజేపీ మోడీని చూపిస్తూ ముందుకు వెళ్లింద‌ని ఇక ఆయ‌న ప‌నై పోయింద‌ని తేలి పోయింద‌న్నారు సీఎం. విచిత్రం ఏమిటంటే రాముడు పేరు చెప్పి ఓట్లు అడిగిన వాళ్ల‌కు చెంప చెళ్లుమ‌నిపించేలా తీర్పు ఇచ్చార‌ని గుర్తు చేశారు.

జ‌నం బేష‌రుతుగా మోడీని వ‌ద్ద‌ని అనుకున్నార‌ని, అందుకే ప్ర‌ధాని ప‌ద‌వికి దూరంగా ఉండాల‌ని సూచించారు రేవంత్ రెడ్డి.