NEWSNATIONAL

బీజేపీకి అంత సీన్ లేదు – రౌత్

Share it with your family & friends

మోడీ నైతికంగా ఓడి పోయాడు

ముంబై – దేశంలో హంగ్ కొన‌సాగుతోంది. ఎవ‌రు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఈ సంద‌ర్బంగా అటు ఎన్డీయే ఇటు ఇండియా కూట‌మి ఎవ‌రికి వారే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. మొత్తం వ్య‌వ‌హారానికి సంబంధించి స్పందించారు శివ‌సేన యుబిటి జాతీయ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ .

బుధ‌వారం ఆయ‌న ముంబైలో మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌లు మోడీని మూకుమ్మ‌డిగా తిర‌స్క‌రించార‌ని అన్నారు. అందుకే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీ సంఖ్య‌ను ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

పీఎం మోడీకి అంత సీన్ లేద‌న్నారు. ఒక ర‌కంగా నైతికంగా ఓడి పోయాడ‌ని ఎద్దేవా చేశారు సంజ‌య్ రౌత్. మేం వేచి చూస్తున్నామ‌ని, ఇండియా కూట‌మి నేత‌లు కీల‌క స‌మావేశంలో పాల్గొన్నార‌ని, స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు .

ఇప్పుడు బీజేపీ సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంద‌న్నారు. ఇది మోదీజీ బలం కాదు. అలాంటి ప్రభుత్వాన్ని నడపాలంటే ఆయన తన సొంత వైఖరిలో ఉండే వార‌న్నారు.