రాష్ట్రానికి ఇక పూర్వ వైభవం
స్పష్టం చేసిన నారా లోకేష్
అమరావతి – దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్లేందుకు గాను మూడు పార్టీలు కలిసి పూర్వ వైభవం తీసుకు వచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు నారా లోకేష్. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుకు శిరసావహిస్తామన్నారు.
ఈ గెలుపును గుండెల్లో పెట్టుకుంటామన్నారు. 1985 నుంచి మంగళగిరిలో పసుపు జెండా ఎగుర లేదన్నారు. తెదేపా, జనసేన, భాజపా శ్రేణుల సహకారంతో 91వేల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించానని చెప్పారు నారా లోకేష్.
నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కక్ష సాధింపులు, వేధింపులు లాంటివి తమకు తెలియదన్నారు. ఆస్తుల విధ్వంసాన్ని ఒప్పుకోమన్నారు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించ బోమంటూ భరోసా ఇచ్చారు.