NEWSANDHRA PRADESH

ఎన్డీయేతోనే ఉన్నాం – బాబు

Share it with your family & friends

స్పీక‌ర్..ఆరు మంత్రి ప‌ద‌వులు

అమ‌రావ‌తి – టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు కీల‌కంగా మారారు దేశ రాజ‌కీయాల‌లో. ఆయ‌న మ‌ద్ద‌తు ఇప్పుడు కేంద్రంలో న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీకి అత్యంత అవ‌స‌రంగా మారింది. అంతే కాకుండా బీహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం కీల‌కంగా మారారు.

మోడీ స‌ర్కార్ ఔర్ ఏక్ బార్ అంటూ ఊద‌ర గొట్టింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. విచిత్రం ఏమిటంటే ఏ రాముడి పేరుతో రాజ‌కీయాలు చేసిందో, ఏ రామాల‌యాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు పొందాల‌ని చూసిందో అక్క‌డే ఓట‌మి పాలైంది. ఇది ఒక ర‌కంగా బిగ్ షాక్.

ఇక అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడారు నారా చంద్ర‌బాబు నాయుడు. తాము ఇండియా కూట‌మితో సంప్ర‌దిస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఆయ‌న కొట్టి పారేశారు. ఇదంతా కావాల‌ని కొంద‌రు చేస్తున్న ప్ర‌చారంగా కొట్టి పారేశారు.

తాము ముమ్మాటికీ ఎన్డీయేతోనే ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న ఢిల్లీకి వెళ్లారు. అక్క‌డ మోడీతో , ఇత‌ర బీజేపీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. మొత్తంగా మ‌రోసారి బాబు కేంద్రంలో చ‌క్రం తిప్ప‌డం మొద‌లు పెట్టారు.