మోడీపై సంజయ్ రౌత్ సెటైర్
ఏ బాబు చేరినా ఒరిగేది ఏమీ లేదు
ముంబై – దేశంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీకి చెందిన సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజలు బీజేపీని , దాని అనుబంధ పార్టీలను ఛీత్కరించారని అన్నారు. అయినా ఏం ముఖం పెట్టుకుని మోడీ సర్కార్ ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కనీసం 295 సీట్లు కావాల్సి ఉందన్నారు. కానీ ఆ మేజిక్ మార్క్ దాటక పోవడం మోడీ వైఫల్యాన్ని, పరాజయాన్ని సూచిస్తోందన్నారు సంజయ్ రౌత్. జనం చెంప ఛెళ్లుమనిపించారని , మోడీ మోసాలు , వ్యూహాలు, అమిత్ షా మ్యాజిక్కులు , గిమ్మిక్కులు పని చేయలేదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు , నితీశ్ బాబు, చిరాగ్ బాబులు ఎంత మంది మోడీ చెంత చేరినా చివరి దాకా ఉంటారా అన్నది వేచి చూడాలన్నారు. ఈ వినోదాన్ని తాము చూస్తూనే ఉంటామని అన్నారు. ఇక మోడీ పనై పోయిందన్నారు సంజయ్ రౌత్.