ప్రజా తీర్పును గౌరవిస్తాం – షర్మిల
చంద్రబాబు..పవన్ కళ్యాణ్ కు కంగ్రాట్స్
అమరావతి – రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఈసారి గణనీయమైన ఓటు శాతం సాధించిందన్నారు. ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల గొంతుక వినిపిస్తామని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఇదే సమయంలో ప్రజలు ఇచ్చే తీరుప్పును ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వారైనా సరే అనుసరించాల్సిందేనని అన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని , వారు తలుచుకుంటే అహంకారం ఓడి పోతుందని తేలి పోయిందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఇక అద్భుత విజయం సాధించిన టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ , బీజేపీ చీఫ్ పురందేశ్వరికి అభినందనలు తెలిపారు ఏపీ పీసీసీ చీఫ్. తాము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తామని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని అన్నారు.