యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వైరల్
ప్రతిపక్ష పాత్ర పోషించిన వైనం
హైదరాబాద్ – ఎవరీ ధ్రువ్ రాఠీ అనుకుంటున్నారా. భారత దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ యూట్యూబర్. తను ఈ కొద్ది కాలంలోనే టాప్ లోకి ఎగ బాకాడు. ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉండడం ధ్రువ్ రాఠీ విశేషం. తను మొదట్లో అంతగా సీరియస్ అంశాల జోలికి వెళ్లలేదు. కానీ మెల మెల్లగా భారత దేశంలో గత 10 ఏళ్లుగా మతం పేరుతో మోడీ సాగిస్తున్న మోసాన్ని, దేశాన్ని అదానీలు, అంబానీలు, టాటాలకు కట్ట బెడుతున్న వైనాన్ని కళ్లకు కట్టినట్లు ఆధారాలతో సహా బయట పెట్టాడు.
దీంతో యూట్యూబ్ ధ్రువ్ రాఠీ వీడియోస్ తో షేక్ అవుతోంది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో అంత కంటే ముందు నుంచీ తను ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతాయా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అంతే కాదు ఎన్నికల సంఘం పనితీరును కూడా తప్పు పట్టాడు. దీనికి వ్యూస్ అత్యధికంగా వచ్చాయి.
ఇదే సమయంలో ఏకంగా ప్రధాని మోడీని ప్రత్యక్షంగానే ప్రశ్నించడం ప్రారంభించాడు. డిక్టేకటర్ షిప్ దిశగా దేశం వెళుతోందా అన్న వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సాధించింది. ఏకంగా మూడున్నర కోట్ల మంది దానిని చూశారు. ఇప్పుడు దేశంలో ధ్రువ్ రాఠీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండడం విశేషం.