ఓడినా ప్రశ్నిస్తూనే ఉంటా
బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
తమిళనాడు – రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. కోయంబత్తూరు లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయన డీఎంకే అభ్యర్థి రాజ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. మా నాయిన రైతు. ఆయన మాజీ సీఎం కాదన్నారు. మీ నమ్మకాన్ని పొందేందుకు నాకు కొంత సమయం పట్టవచ్చని చెప్పారు అన్నామలై కుప్పు స్వామి.
కానీ నేను నిరాశ పడే వ్యక్తిని కానని చెప్పారు. కష్టపడి పైకి వచ్చానని, ఎస్పీగా పని చేశానని, దేశం కోసం అభిమానంతో రాజకీయాలలోకి వచ్చానని అన్నారు అన్నామలై. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. ఇవాళ యావత్ భారతం బీజేపీని మరోసారి అధికారాన్ని కట్టబెట్టిందని అన్నారు. సమర్థవంతమైన నాయకుడిగా మోడీని ఎంపిక చేశారని చెప్పారు.