NEWSNATIONAL

ముగిసిన స‌మావేశం మోడీనే పీఎం

Share it with your family & friends

ప్ర‌భుత్వ ఏర్పాటుకు రంగం సిద్దం

న్యూఢిల్లీ – ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఎన్డీయే స‌మావేశం ముగిసింది. ఈ స‌మావేశానికి కీల‌క భాగ‌స్వామ్య ప‌క్షాల నేత‌లు హాజ‌ర‌య్యారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ లేక పోవ‌డంతో బీజేపీ త‌మ మిత్ర ప‌క్షాల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది. దీంతో అత్య‌ధిక సీట్లు సాధించిన వారిలో ఆంధ్ర‌ప్రేద‌శ్ కు చెందిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీల‌కంగా మారారు.

దీంతో ఈ స‌మావేశంలో ఆ ఇద్ద‌రు నేత‌లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఏపీ నుంచి 25 సీట్లు ఎన్డీయే ఖాతాలో చేర‌నున్నాయి. ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మైన 295 సంఖ్య‌కు గాను కొంద‌రు ఇండిపెండెంట్లు సైతం మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చార‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా వెల్ల‌డించారు.

ఎన్డీయే కీల‌క స‌మావేశం ఇవాళ మోడీ నివాసంలో జ‌రిగింది. ఇక ముచ్చ‌ట‌గా మూడోసారి పీఎంగా కొలువు తీర‌నున్నారు న‌రేంద్ర మోడీ. ఆయ‌న‌కు ఇరు వైపులా అమిత్ షాతో పాటు జేపీ న‌డ్డా ఉన్నారు. నితీశ్ కుమార్ కు చెందిన 12 సీట్లు కూడా కీల‌కం కానున్నాయి.

ఇదిలా ఉండ‌గా చంద్ర‌బాబు నాయుడు స్పీక‌ర్ ప‌ద‌వితో పాటు ఆరు ముఖ్య‌మైన మంత్రి ప‌ద‌వుల‌ను కోరిన‌ట్లు స‌మాచారం.