DEVOTIONAL

ఈవో ధ‌ర్మారెడ్డికి బిగ్ షాక్

Share it with your family & friends

సెల‌వు ప్ర‌తిపాద‌న తిర‌స్క‌ర‌ణ

అమ‌రావ‌తి – నిన్న‌టి దాకా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అంతా తానై వ్య‌వ‌హ‌రించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మా రెడ్డికి కోలుకోలేని షాక్ త‌గిలింది.

ఆయ‌న‌తో పాటు చాలా మంది డెప్యూటేష‌న్ పై కీల‌క‌మైన శాఖ‌ల‌లో ఉన్న‌త ప‌ద‌వులు నిర్వ‌హిస్తున్న వారంతా మూకుమ్మ‌డిగా త‌మ‌ను రిలీవ్ చేయాలంటూ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. గ‌తంలో వీరంతా అధికార మ‌దంతో విర్ర వీగారు. తాము ఏది చెబితే అదే చ‌ట్టం, శాస‌నం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏరికోరి ఇత‌ర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నారు. కేవ‌లం త‌మ సామాజిక (రెడ్డి) వ‌ర్గానికి చెందిన వారిని అందలం ఎక్కించారు. వారిలో ఎక్కువ‌గా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏకైక వ్య‌క్తి టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి.

ప‌విత్ర‌మైన పుణ్య క్షేత్రాన్ని రాజ‌కీయ క్షేత్రంగా మార్చేసిన ఘ‌న‌త ఈయ‌న గారికే ద‌క్కుతుంది. తాజాగా ఆయ‌నకు చంద్ర‌బాబు కూట‌మి స‌ర్కార్ కోలుకోలేని రీతిలో ఝ‌ల‌క్ ఇచ్చింది. తాను సెల‌వుల‌పై వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా ఆయ‌న సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అనుమ‌తి ఇచ్చేది లేదంటూ తిర‌స్క‌రించింది.