NEWSNATIONAL

7న ఎన్డీఏ కీల‌క సమావేశం

Share it with your family & friends

మ‌రోసారి ఢిల్లీకి బాబు..ప‌వ‌న్

న్యూఢిల్లీ – ఎవ‌రు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నార‌నే దానిపై కేంద్రంలో ఉత్కంఠ‌కు తెర ప‌డింది. ఎట్ట‌కేల‌కు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ చివ‌రి వ‌ర‌కు ఎటు వైపు ఉంటార‌నే దానిపై స‌స్పెన్స్ కొన‌సాగింది. కానీ ఆ ఇద్ద‌రు నేత‌లు తాము బేష‌ర‌తుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మిలోనే కొన‌సాగుతామ‌ని, సంపూర్ణ స‌పోర్ట్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఎన్డీయేలోని భాగ‌స్వామ్య ప‌క్షాల‌న్నీ ఏకగ్రీవంగా త‌మ నాయ‌కుడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అంటూ ప్ర‌క‌టించాయి. దీంతో తెర వెనుక ట్ర‌బుల్ షూట‌ర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా న‌డిపించిన మంత్రాంగం వ‌ర్క‌వుట్ అయ్యింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మేజిక్ ఫిగ‌ర్ చేరుకునేందుకు కావాల్సిన బ‌ల‌గాన్ని ఆయ‌న త‌యారు చేశారు.

మొత్తంగా భార‌త దేశ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త‌ను సృష్టించేందుకు సిద్ద‌మ‌య్యారు న‌రేంద్ర మోడీ. ఆయ‌న చెప్పిన‌ట్లు 400 సీట్లు రాలేదు. స‌రిక‌దా స‌ర్కార్ ను ఏర్పాటు చేసేందుకు స‌రిప‌డా సంఖ్య‌ను తెచ్చుకోలేక పోయారు. విచిత్రం ఏమిటంటే అయోధ్య‌లో ఓట‌మి పాల‌య్యారు. మోడీ గ్రాఫ్ త‌గ్గడం ఒకింత విస్తు పోయేలా చేసింది.