ఎన్డీయే నిర్ణయం మోడీనే పీఎం
దేశ చరిత్రలో మూడోసారి రికార్డ్
న్యూఢిల్లీ – భారత దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించ బోతున్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఆయన 143 కోట్ల మంది కలిగిన ఈ దేశానికి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా కొలువు తీరనున్నారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ కూటమి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం విశేషం.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యా బలాన్ని అందుకోలేక పోయింది భారతీయ జనతా పార్టీ. మతాన్ని, కులాన్ని, అయోధ్యలోని శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని చేసిన రాజకీయాలు వర్కవుట్ కాలేదు. విచిత్రంగా నరేంద్ర మోడీ పోటీ చేసిన వారణాసిలో సైతం ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ప్రధాని వెనుకంజలో ఉండడం కూడా ఆయన పట్ల ఉన్న వ్యతిరేకత ఏపాటిదో అర్థమైంది.
ఇక నిన్నటి దాకా బీజేపీ , మోడీ, షా పట్టించుకోకుండా ఉన్న టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ లే ఇప్పుడు ఎన్డీయేను శాసించే స్థాయికి చేరుకోవడం విశేషం. మొత్తంగా ఈనెల 7న కీలక సమావేశం కానుంది. ఆరోజు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ఈనెల 8న లేదా 9న పీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు మోడీ.