NEWSNATIONAL

ఎన్డీఏ ప్ర‌భుత్వం బాబు..నితీశ్ కీల‌కం

Share it with your family & friends

ముచ్చ‌ట‌గా మూడోసారి మోడీ పీఎం

న్యూఢిల్లీ – దేశ రాజ‌కీయాల‌లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో తెలుగుదేశం పార్ట చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీల‌కంగా మారారు. ఈ ఇద్ద‌రూ అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కులుగా గుర్తింపు పొందారు.

ఈసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటుకు కావాల్సిన 295 సీట్ల‌ను ద‌క్కించుకోలేక పోయింది. దీంతో తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంది.

ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు పార్టీతో పాటు నితీశ్ కుమార్ కు చెందిన ఎంపీలు కీల‌కంగా మార‌నున్నారు. ఈ ఇద్ద‌రు ప్ర‌స్తుతం కొత్త‌గా కొలువు తీరే ఎన్డీయే స‌ర్కార్ లో ముఖ్య భూమిక పోషించ‌నున్నారు.

కేంద్ర స‌ర్కార్ లో ముఖ్య‌మైన ప‌ద‌వుల‌ను పొందేందుకు చంద్ర‌బాబు ప్లాన్ చేసిన‌ట్లు ప్లాన్. చివ‌ర‌కు తాము ఎవ‌రినైతే వ‌ద్ద‌ని అనుకున్నారో బాబు, నితీశ్ కుమార్ ఇప్పుడు కావాల్సి రావ‌డం మోడీకి మింగుడు ప‌డ‌ని అంశం. ఏది ఏమైనా ఈ ఇద్ద‌రు సీఎంలు ట్ర‌బుల్ షూట‌ర్లు కావ‌డం విశేషం.