NEWSNATIONAL

అయోధ్య తీర్పు చెంప పెట్టు

Share it with your family & friends

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్

ఉత్త‌ర ప్ర‌దేశ్ – ఎస్పీ చీఫ్ , మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాద‌వ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. యూపీలో బీజేపీ గాలి పోయింద‌న్నారు. మోడీ చ‌రిష్మా, యోగి ప‌వ‌ర్ ప‌ని చేయ‌లేదంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌లు స‌రైన తీర్పు ఇచ్చార‌ని కొనియాడారు. గురువారం అఖిలేష్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. ఆయ‌న పార్టీ ఈసారి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భారీ సీట్ల‌ను కైవ‌సం చేసుకున్నారు. ఇది బీజేపీని విస్తు పోయేలా చేసింది. ప్ర‌ధానంగా త‌న‌తో పాటు రాహుల్ గాంధీ కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగారు. మోడీకి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా ఈసారి ఎన్నిక‌ల్లో మోడీని, అయోధ్య‌లో రామ మందిరం ఆల‌యాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా ప్ర‌చారం చేప‌ట్టింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. చివ‌ర‌కు అయోధ్య‌లో ఓట‌మి పాలైంది. జ‌నం ఈస‌డించి కొట్టారు. చెంప ఛెళ్లుమ‌నిపించారు.

రామ మందిరం నిర్మాణం పేరుతో అక్క‌డ ఉన్న 2 వేలకు పైగా దుకాణాదారుల‌ను హింసించార‌ని, వారికి స‌రైన ప‌రిహారం ఇవ్వ‌కుండా ఇబ్బందులు పెట్టారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే కోలుకోలేని రీతిలో అయోధ్య వాసులు అద్భుతమైన తీర్పు ఇచ్చార‌ని, స‌మాజ్ వాది పార్టీకి ప‌ట్టం కట్టారంటూ కొనియాడారు అఖిలేష్ యాద‌వ్.