వైసీపీ నేతలపై టీడీపీ దాడులు
ఆందోళన వ్యక్తం చేసిన జగన్ రెడ్డి
అమరావతి – ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తీవ్రంగా స్పందించారు. ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతున్నాయని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు జగన్ రెడ్డి.
రాష్ట్ర మంతటా ప్రస్తుతం దాడులతో భయానక వాతావరణం నెలకొందని ఆవేదన చెందారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వారిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి.
ప్రధానంగా ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే ల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారి పోయిందని వాపోయారు. ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.
దాడులకు గురైన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి.