సెలవులో వెళ్లిన జవహర్ రెడ్డి
ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ కూడా
అమరావతి – సీన్ మారింది. జగన్ రెడ్డి దారుణంగా ఓడి పోయాడు. ఆయనకు ప్రతిపక్ష పాత్ర లేకుండా చేశారు ఏపీ జనం. ఇది పక్కన పెడితే ఇంకా కొత్తగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అప్పుడే కీలకమైన శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో పాటు డెప్యూటేషన్ పై వచ్చిన వారు కూడా పెట్టే బేడా సర్దుకుంటున్నారు.
ఇక తమ ఆటలు చెల్లవంటూ వారు సెలవుల్లో వెళుతుండడం, మరికొందరు తెలంగాణ వైపు లేదా కేంద్రానికి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సంచలన విషయం వెలుగు చూసింది. జగన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా ఉన్న జవహర్ రెడ్డి ఉన్నట్టుండి నిన్న నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు.
మర్యాద పూర్వకంగా కలిసినా చివరకు బాబు కేవలం ఒకే ఒక్క నిమిషం సమయం ఇచ్చినట్టు టాక్. ఎన్నిక ల సమయంలో పూర్తిగా జగన్ మోహన్ రెడ్డికి సహకరించారన్న ఆరోపణలు జవహర్ రెడ్డిపై ఉన్నాయి. దీంతో ఇంకా కొత్తగా సర్కార్ కొలువు తీరక ముందే ఆయన కూడా సెలవులో వెళ్లడం ఆశ్చర్య పరిచేలా చేసింది.