NEWSANDHRA PRADESH

వైసీపీ ఓట‌మిపై జ‌గ‌న్ స‌మీక్ష

Share it with your family & friends

హాజ‌రైన పేర్ని..కొడాలి..స‌జ్జ‌ల‌

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఊహించ‌ని రీతిలో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. భారీ ఎత్తున ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌భంజనంలా వచ్చిన జ‌గ‌న్ రెడ్డి పార్టీ ఉన్న‌ట్టుండి 2024 వ‌ర‌కు వ‌చ్చే స‌రిక‌ల్లా దారుణంగా ప‌రాజ‌యం పొంద‌డాన్ని జీర్ణించుకోలేక పోతోంది.

అద్భుతంగా ఆశీర్వ‌దించ‌డంతో జ‌గ‌న్ రెడ్డి జ‌న రంజ‌క పాల‌న సాగించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. విద్యా , వైద్యం, వ్య‌వ‌సాయ రంగంపై ఎక్కువ‌గా దృష్టి పెట్టారు.

ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేశారు. సంక్షేమ ఫ‌లాల‌ను పేద‌లు, నిరుపేద‌లు, మ‌ధ్య త‌ర‌గతి ప్ర‌జ‌లతో పాటు అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారికి ల‌బ్ది చేకూర్చేలా చేశారు. అయినా జ‌గ‌న్ రెడ్డిని, ఆయ‌న పార్టీని ఛీ కొట్టారు జ‌నం. ఇది ఊహించ‌ని షాక్.

ఇదిలా ఉండ‌గా దారుణ ప‌రాజ‌యంపై గురువారం జ‌గ‌న్ రెడ్డి త‌న నివాసంలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. ఈ కీల‌క స‌మావేశానికి స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి, పెద్ది రెడ్డి రామ‌చంద్రా రెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, గురుమూర్తి, శివ ప్ర‌సాద రెడ్డి ఉన్నారు.