NEWSNATIONAL

ఉద్ద‌వ్ ఠాక్రేకు ఎన్డీఏ ఆఫ‌ర్

Share it with your family & friends

హ‌నుమాన్ బెనివాల్ కూడా

ముంబై – భార‌తీయ జ‌న‌తా పార్టీ బుజ్జ‌గింపుల‌తో పాటు ఫిరాయింపుల‌కు పాల్ప‌డే వారికి గాలం వేసే ప‌నిలో ప‌డింది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బ‌లం ఉన్న‌ప్ప‌టికీ మ‌రికొంద‌రిని కూడా చేర్చుకునేందుకు ఆస‌క్తి చూపిస్తోంది. ఈ త‌రుణంలో బీజేపీలో ట్రబుల్ షూట‌ర్ గా పేరు పొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా రంగంలోకి దిగారు.

ఈ మేర‌కు ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన ఇండియా కూట‌మిలో కీల‌కంగా ఉన్న శివ‌సేన బాల్ ఠాక్రే కు చెందిన చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో సంప్ర‌దింపులు మొద‌లు పెట్టారు. ఇందు కోసం తాను మోనిట‌రింగ్ చేస్తుండ‌గా మ‌రో వైపు ఏకంగా ఓ మంత్రిని కేటాయించ‌డం విశేషం.

నిన్న జ‌రిగిన కూట‌మి స‌మావేశానికి ఉద్ద‌వ్ ఠాక్రే హాజ‌రు కాలేదు. కానీ ఆ పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఆయ‌న ఇంటికి ఇవాళ ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ వెళ్లారు. మొత్తంగా మోడీ సార‌థ్యంలో ప్ర‌భుత్వం ఎలా ఇబ్బందుల‌కు గురి చేసింద‌నే దానిపై పున‌రాలోచిస్తున్న‌ట్టు స‌మాచారం.