NEWSTELANGANA

చంద్ర‌బాబుకు రేవంత్ రెడ్డి ఫోన్

Share it with your family & friends

విజ‌యం సాధించినందుకు కంగ్రాట్స్

హైద‌రాబాద్ – ఏపీలో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసిన తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ , బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రికి శుభాకాంక్ష‌లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.

ఈ సంద‌ర్బంగా గురువారం సీఎం చంద్ర‌బాబుకు ఫోన్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించు కునేందుకు సహకరించాలని కోరారు.

ఇవాళ‌ మహబూబాబాద్ నియోజకవర్గ ఫలితాలపై సమీక్ష చేప‌ట్టారు. మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విప్ రాంచంద్ర నాయక్, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. అదే సమావేశం నుంచి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.