గవర్నర్ కు ఎమ్మెల్యేల జాబితా
అందజేసిన ఏపీ సీఈవో మీనా
అమరావతి – ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. 175 శాసన సభ నియోజకవర్గాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికైన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం . ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తి నివేదికను తయారు చేశారు. పూర్తి ఫలితాలతో కూడిన నివేదికను సీఈవో గవర్నర్ ను గురువారం కలిశారు. రిపోర్ట్ ను అందజేశారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో భారత ఎన్నికల సంఘం ప్రిన్సిఫల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అదనపు సీఈవో లు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ రవీంధర్ కుమార్ తదితరులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన వారిలో ఉన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులుగా జాబితాను అందజేశారు. వైసీపీ కేవలం కొన్ని సీట్లకే పరిమితం కాగా టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన, బీజేపీ బోణీ కొట్టాయి.