మోడీపై భగ్గుమన్న రాహుల్ గాంధీ
ఎన్నికల ఫలితాలు ఆసక్తికరం
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు, రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. దేశంలో ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. అదానీకి, మోడీకి మధ్య అవినీతి బంధం నెలకొందని ఆరోపించారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసని దీనిని ఎవరూ విస్మరించ లేరన్నారు రాహుల్ గాంధీ.
ఎన్నికల ప్రచారంలో పదే పదే మోడీ ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి కామెంట్స్ చేశారని, దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు . డేటాను భద్రంగా ఉంచాల్సిన అధికారిక వ్యవస్థ పూర్తిగా మోడీ చేతుల్లోకి వెళ్లడం దారుణమని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
తన అనుయాయులకు , పెట్టుబడిదారులైన స్నేహితులకు మేలు చేకూర్చేలా నిన్నటి దాకా ప్రయత్నం చేశారంటూ ధ్వజమెత్తారు.