NEWSNATIONAL

కుల్వింద‌ర్ కౌర్ స‌స్పెండ్

Share it with your family & friends

ఎంపీ కంగ‌నాపై చెంప దెబ్బ

న్యూఢిల్లీ – భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ప్ర‌ముఖ న‌టి , నూత‌న ఎంపీగా గెలుపొందిన కంగ‌నా ర‌నౌత్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఆమె హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుండి దేశ రాజ‌ధానికి వ‌చ్చిన స‌మ‌యంలో ఎయిర్ పోర్ట్ లో కొంద‌రు ఖ‌లిస్తాన్ అనుకూల వాదులు నినాదాలు చేశారు.

ఈ సంద‌ర్భంగా రైతులు త‌మ న్యాయ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఆందోళ‌న చేప‌ట్టారు. ఆ స‌మ‌యంలో కంగ‌నా ర‌నౌత్ మోడీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. బీజేపీ స‌ర్కార్ కు వంత పాడారు. ఇదే స‌మ‌యంలో రైతుల‌ను అన‌రాని మాట‌లు అన్నారు. వారికి తెలివి లేదంటూ కూడా ఎద్దేవా చేశారు.

దేశ అభివృద్దిలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న రైతుల ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేసిందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది సీఐఎస్ఎఫ్ ఆఫీస‌ర్ కుల్వింద‌ర్ కౌర్. ఈ సంద‌ర్బంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆమె సెక్యూరిటీగా ఉన్నారు ఎయిర్ పోర్ట్ లో. అనుకోకుండా కౌర్ కంగనా చెంప ఛెళ్లుమ‌నిపించారు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది.

దీంతో వెంట‌నే కుల్వింద‌ర్ కౌర్ ను స‌స్పెండ్ చేశారు. పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశారు. కేసు న‌మోదు చేశారు.