సురేష్ గోపి షాకింగ్ కామెంట్స్
రెండు రాష్ట్రాల గొంతు వినిపిస్తా
కేరళ – భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నటుడు సురేష్ గోపి బోణీ కొట్టారు. ఆయన విజయం వరించిన తర్వాత భావోద్వేగానికి లోనయ్యారు. గెలుపొందిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదే సమయంలో తాను బీజేపీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తాను ప్రాతినిధ్యం వహిస్తానని స్పష్టం చేశారు సురేష్ గోపి. కేరళ నుంచి తాను తొలిసారిగా బీజేపీ నుంచి ఎన్నిక కావడం తనను మరింత ఆనందానికి లోను చేసిందన్నారు.
తనపై నమ్మకం ఉంచి తనకు టికెట్ కేటాయించిన బీజేపీకి, హై కమాండ్ కు , పీఎం మోడీకి, అమిత్ షా, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు సురేష్ గోపి. ఇక నుంచి ప్రజల గొంతును, వారి సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని చెప్పారు. తను ఒక్కడే గెలుపొందడంతో వైరల్ గా మారారు.