కోర్టు కేసులో రాహుల్ కు ఊరట
బెయిల్ మంజూరు చేసిన కోర్టు
బెంగళూరు – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. గత ఎన్నికల సందర్బంగా కర్ణాటకలో జరిగిన ప్రచార సభలో రాహుల్ అప్పటి భారతీయ జనతా పార్టీ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి పనికి లంచం తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. దీంతో పాటు 40 శాతం కమీషన్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీకి చెందిన నేతలు కోర్టును ఆశ్రయించారు.
పరువు నష్టం కేసు వేశారు. దీనిపై విచారణ కొనసాగుతూ వచ్చింది. ఇవాళ బెంగళూరు కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాహుల్ గాంధీకి ఊరట లభించింది.
ఇదిలా ఉండగా గత ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీపై కమీషన్ సర్కార్ ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ఇవాళ రాహుల్ గాంధీ తో పాటు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు.