NEWSNATIONAL

మంత్రి ప‌ద‌విపై ఆస‌క్తి లేదు

Share it with your family & friends

చిరాగ్ పాశ్వాన్ షాకింగ్ కామెంట్స్

న్యూఢిల్లీ – దివంగ‌త కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ త‌న‌యుడు ప్ర‌స్తుతం ఎంపీగా గెలుపొందిన చిరాగ్ పాశ్వాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. త‌న‌కు మంత్రి ప‌ద‌విపై ఎలాంటి ఆస‌క్తి లేద‌ని అన్నారు.

త‌న‌కు వ‌స్తుందో లేదోన‌ని తాను ఆలోచించ‌డం లేద‌ని చెప్పారు చిరాగ్ పాశ్వాన్. త‌న ల‌క్ష్యం కేబినెట్ లో చోటు కాద‌న్నారు. తాను కోరుకున్న‌ది ఒక్క‌టేన‌ని దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా మూడోసారి న‌రేంద్ర మోడీ కొలువు తీరాల‌ని అన్నారు.

కూట‌మికి చెందిన వేర్వేరు పార్టీలు త‌మ‌కు శాఖ‌లు కావాలంటూ డిమాండ్ చేస్తున్నాయంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను చిరాగ్ పాశ్వాన్ కొట్టి పారేశారు. ఇది పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు. ఏ పార్టీ కూడా త‌మ‌కు మంత్రిత్వ శాఖ కోర లేద‌ని చెప్పారు.

తాను ఎప్ప‌టికీ మోడీ భక్తుడిగానే ఉంటాన‌ని, ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న‌కు తాను ఆంజ‌నేయుడినంటూ పేర్కొన్నారు చిరాగ్ పాశ్వాన్.