రైతులను గౌరవించక పోతే ఎలా
కంగనాపై దాడిపై సంజయ్ రౌత్
ముంబై – భారతీయ జనతా పార్టీ ఎంపీ , ప్రముఖ నటి కంగనా రనౌత్ పై సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కౌర్ చెంప దెబ్బ కొట్టడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆమెను సస్పెండ్ కూడా చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు శివసేన బాల్ ఠాక్రే పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కొందరు ఓట్లు వేస్తారని, మరికొందరు చెప్పుతో కొడతారు..అసలు అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు సంజయ్ రౌత్. రైతు ఆందోళన సమయంలో వారి తరపున తాను కూడా మాట్లాడానని, కానీ ఏనాడూ వ్యతిరేకంగా కామెంట్స్ చేయలేదని చెప్పారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన సమయంలో మనం సంయమనం పాటించాలని ఆ విషయం గమనించకుండా ఎలా పడితే అలా ఆరోపణలు చేయడం, విమర్శించడం చేస్తూ పోతే చివరకు దాడులకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు సంజయ్ రౌత్.