NEWSNATIONAL

9న పీఎంగా మోడీ ప్ర‌మాణం

Share it with your family & friends

బీజేపీ నేత ప్ర‌హ్లాద్ జోషి ప్ర‌క‌ట‌న

న్యూఢిల్లీ – భార‌త దేశ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డు సృష్టించ బోతున్నారు న‌రేంద్ర మోడీ. ఆయ‌న ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీర‌నున్నారు. శుక్ర‌వారం న్యూఢిల్లీలో బీజేపీ పార్ల‌మెంట‌రీ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా మోడీని త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు. ఇందుకు సంబంధించి ఏక‌గ్రీవ తీర్మానం చేశారు.

ఈనెల 9వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రిగా మోడీ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నార‌ని ప్ర‌క‌టించారు. గ‌తంలో జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ మాత్ర‌మే మూడుసార్లు పీఎంగా ప‌ని చేశారు. ఆ రికార్డును బ్రేక్ చేయ‌బోతున్నారు న‌రేంద్ర మోడీ.

ఇదిలా ఉండ‌గా ఎన్డీయే పార్ల‌మెంటరీ స‌మావేశంలో జోషి ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఎంపీలు, భాగ‌స్వామ్య ప‌క్షాలు పెద్ద ఎత్తున హ‌ర్ష‌ధ్వానాలు చేశారు. చ‌ప్ప‌ట్ల‌తో స్వాగ‌తం ప‌లికారు న‌రేంద్ర మోడీకి. ఇదిలా ఉండ‌గా ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే మోడీ త‌న రాజీనామా ప‌త్రాన్ని రాష్ట్ర‌ప‌తికి అంద‌జేశారు. త‌న‌తో పాటు కేబినెట్ లోని మంత్రుల రాజీనామాల‌తో కూడిన లేఖ‌ను కూడా స‌మ‌ర్పించారు.