తిరుమల సన్నిధిలో సీఈవో మీనా
కుటుంబంతో సహా పూజలు
తిరుమల – కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. శుక్రవారం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా దర్శించుకున్నారు. ఆయనతో పాటు భార్య, తనయుడు, కూతురు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
బ్రేక్ దర్శన సమయంలో ఎన్నికల ప్రధాన అధికారి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు సాదర స్వాగతం పలికింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ ) సభ్యులతో పాటు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా స్వామి వారి దర్శనం అనంతరం ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. స్వామి వారి కృప కారణంగా ఏపీలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికలను అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రధాన ఎన్నికల అధికారి.