NEWSNATIONAL

మోడీకి టీడీపీ బేష‌ర‌తు మ‌ద్ద‌తు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు నాయుడు

న్యూఢిల్లీ – దేశంలో రాజ‌కీయాలు ఒక్కోసారి అనుకోని రీతిలో మారిపోతూ ఉంటాయి. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ దేశంలో వెల్ల‌డైన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు. మోడీ, అయోధ్య‌లోని రాముడి పేరుతో బీజేపీ భారీ ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టింది. అయినా ఆశించిన మేర మేజిక్ ఫిగ‌ర్ ను చేరుకోలేక పోయింది. చ‌తికిల ప‌డింది బీజేపీ.

ఏపీలో తెలుగుదేశం పార్టీ ప‌నై పోయిందంటూ పదే ప‌దే భార‌తీయ జ‌నతా పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు., రాజ్య‌స‌భ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు ఏకంగా త‌మ పార్టీలో క‌లిపేసుకుంటామంటూ అనుచిత వ్యాఖ్య‌లు కూడా చేశారు.

కానీ కాలం చాలా విచిత్రమైంది. తాజాగా ఏర్ప‌డిన మోడీ ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇవాళ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో మోడీకి బేష‌ర‌తు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎంత విచిత్రం క‌దూ. నిన్న‌టి దాకా జైలులో ఉండి అనూహ్యంగా బెయిల్ పై వ‌చ్చి ..ఇప్పుడు ఎన్డీయేలో కింగ్ మేక‌ర్ గా గుర్తింపు పొంద‌డం. అది బాబుకు మాత్ర‌మే చెల్లింది క‌దూ.