ఏపీలో చారిత్రాత్మక విజయం
ప్రశంసించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ – నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే – బీజేపీ కీలక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన విజయాన్ని సాధించినట్లు స్పష్టం చేశారు . మోడీని ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
ఏపీలో చంద్రబాబుతో కలిసి ఏపీలో చారిత్రాత్మక గెలుపు సాధించామన్నారు మోడీ. ఇదే సమయంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన వ్యక్తి కాదు శక్తి అంటూ పేర్కొ్నారు. తుఫాన్ ను తలపించేలా ఫలితాలు వచ్చేలా చేశాడని చెప్పారు మోడీ.
ఏపీలో వచ్చిన విజయం సామాన్యుడి ఆకాంక్షలకు ప్రతి రూపం అని స్పష్టం చేశారు . రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీని కలపడంలో కీలకమైన పాత్ర పోషించారంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చెప్పారు మోడీ.
ఈ విజయం తమపై మరింత బాధ్యత పెంచిందని అన్నారు. తాము కలిసికట్టుగా దేశం అభివృద్దితో పాటు ఏపీ రాష్ట్ర పురోభివృద్దికి కృషి చేస్తామన్నారు.