NEWSANDHRA PRADESH

సీఎస్ గా నీర‌బ్ బాధ్య‌తల స్వీక‌ర‌ణ

Share it with your family & friends

జ‌వ‌హ‌ర్ రెడ్డి స్థానంలో కొలువు తీరిన కుమార్
అమ‌రావ‌తి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు , విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సిఎస్ గా కొలువు తీరారు. ఆయ‌న‌ను ఆశీర్వ‌దించారు. ప్ర‌సాదాల‌తో పాటు దేవాల‌యాల చిత్ర ప‌టాల‌ను అంద‌జేశారు సీఎస్ కు.

ఈ కార్యక్రమంలో జిఏడి కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సిఎస్ గోపాల కృష్ణ ద్వివేది, పిసిసిఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి, ఐటి కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న జ‌వ‌హ‌ర్ రెడ్డి సెల‌వుల్లో వెళ్లారు. ఆయ‌న ఉండ‌డాన్ని జీర్ణించు కోలేక పోయారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంలో స‌ర్కార్ మారింది. టీడీపీ కూట‌మి ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది.