ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం
స్పష్టం చేసిన రాహుల్ గాంధీ
బెంగళూరు – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు, రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం పరువు నష్టం కేసులో హాజరయ్యేందుకు బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్బంగా సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో కలిసి సమీక్ష చేపట్టారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఓడి పోయిన వారితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అధికారం కంటే ప్రజలకు సేవ చేయడంపైనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ.
రాష్ట్ర, దేశ అభివృద్ది కోణంలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. పలు సూచనలు చేశారు. వారి అభిప్రాయాలను స్వీకరించారు .
అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ప్రధాన మంత్రి మోడీకి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పారని అన్నారు. ఆయన రాజ్యాంగాన్ని నాశనం చేయాలని అనుకున్నారని , కానీ వర్కవుట్ కాలేదన్నారు. రాబోయే కాలంలో మోడీకి గడ్డు కాలం దాపురించక తప్పదన్నారు.
ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తూనే ఉంటామని, ప్రజల వాయిస్ ను వినిపిస్తామని ప్రకటించారు.