ప్రజలను మోసం చేస్తే ఊరుకోం
ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ వార్నింగ్
న్యూఢిల్లీ – ఎవరీ చంద్రశేఖర్ ఆజాద్ అనుకున్నారా. గత కొంత కాలంగా యూపీలో ప్రజల తరపున పని చేస్తున్నారు. తన వాయిస్ ను వినిపిస్తూ వస్తున్నారు. ఈసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాడు. తనపై కూడా దాడి జరిగింది. అయినా త్రుటిలో తప్పించుకున్నాడు చంద్రశేఖర్ ఆజాద్. తను అంబేద్కరిస్ట్. తన వాయిస్ ను ప్రజల కోసం అంకితం చేశాడు.
యూపీలో నగీనా లోక్ సభ స్థానం నుండి ఎంపీగా గెలుపొందాడు చంద్రశేఖర్ ఆజాద్. ఆయన ఆజాద్ సమాజ్ పార్టీని స్థాపించాడు. దీనికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. కోట్లాది మంది ప్రజలకు కనీస సౌకర్యాలకు కూడా నోచుకోవడం లేదని ఆవేదన చెందారు.
ఈ దేశంలో దేశంలో 80 కోట్ల మందికి పైగా ప్రజలు సాధికారత, భద్రత కల్పించాలని మేము హామీ ఇచ్చామన్నారు, కానీ ఇప్పుడు తాము వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. వాగ్దానాలు.. కులం, మతం ఆధారంగా ప్రజలను దోపిడీకి గురిచేస్తే దానిని అంగీకరించబోమని చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు.