NEWSNATIONAL

మంత్రికి మ‌తి భ్ర‌మించింది – డీకేఎస్

Share it with your family & friends

డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్

బెంగ‌ళూరు – క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈసారి జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన సీట్ల‌ను సాధించ లేక పోయింది. ఈ సంద‌ర్భంగా స్పందించారు డీకే.

క‌ర్ణాట‌క‌లోని బెళ‌గావి లోక్ స‌భ స్థానంలో పార్టీకి చెందిన అభ్య‌ర్థి ఓట‌మిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న కేబినెట్ లో మంత్రిగా ఉన్న జార్కి హూళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న పార్టీ నాయ‌క‌త్వంపై చుల‌క‌న చేస్తూ మాట్లాడ‌టం క‌ల‌క‌లం రేపింది.

మంత్రికి మతి భ్ర‌మించిందని మండిప‌డ్డారు డీకే శివ‌కుమార్. ఆయ‌న‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి పంపిస‌త్ఆమ‌ని ప్ర‌క‌టించారు. పార్టీ నేత‌ల మితి మీరిన ఆత్మ విశ్వాసం వ‌ల్ల‌నే క‌ర్ణాట‌క‌లో రెండెంకెల‌కు చేరుకోలేక పోయామ‌ని జార్కి హోళీ కామెంట్ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు డీకే శివ‌కుమార్.