రామోజీరావు కన్నుమూత
ఈనాడు సంస్థల అధిపతి
హైదరాబాద్ – ఈనాడు సంస్థల చీఫ్ చెరుకూరి రామోజీరావు కన్ను మూశారు. భారత దేశ మీడియా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు. ప్రధానంగా తెలుగు పత్రికా, ప్రసార మాధ్యమాలలో ఈనాడును టాప్ లో నిలిపేలా చేశారు.
శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో హుటా హుటిన నానక్ రామ్ గూడ లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు.
ఈనాడు పత్రికను ఇంటింటికి చేర్చిన ఘనత రామోజీరావుదేనని చెప్పక తప్పదు. ఒక రకంగా చెప్పాలంటే రామోజీరావు అంటేనే తెలుగు వెలుగు. రామోజీ ఫిలిం సిటీ కూడా ఆయన నిర్మించిందే. ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడికి తరలించారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
వేలాది మందికి ఉపాధి కల్పించారు. ఇక రామోజీరావుది ఏపీలోని కృష్ణా జిల్లా. 16, నవంబర్ 1936లో పెదపారుపూడిలో పుట్టారు. ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. 10న ఆగస్టు 1974లో ఈనాడు పత్రికకు శ్రీకారం చుట్టారు. ప్రాంతీయ దినపత్రికలకు మార్గదర్శిగా ఉన్నారు. అక్షర యోధుడు ఇక లేడు అని పేర్కొన్నారు. ఈనాడు సంచలనం. రామోజీరావు లేక పోవడం తెలుగు వారికి తీవ్ర నష్టం.