రామోజీ మరణం దిగ్భ్రాంతికరం
ఎనుముల రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్ – ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్బంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రామోజీరావు అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా తెలియ రాలేదు.
ఇదిలా ఉండగా తెలుగు వారి ఆస్తిగా పేరు పొందిన రామోజీరావు మరణం ఇరు రాష్ట్రాలకు తీరని లోటు అని పేర్కొన్నారు సీఎం. ఆయనతో తనకు సన్నిహిత సంబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో , తర్వాత సీఎంగా ఎన్నికయ్యాక తాను రామోజీరావును కలుసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్బంగా ఎనుముల రేవంత్ రెడ్డి.