రామోజీ మరణం దిగ్భ్రాంతికరం
మెగాస్టార్ చిరంజీవి సంతాపం
హైదరాబాద్ – ఈనాడు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు , మెగాస్టార్ చిరంజీవి. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఎనలేని సేవలందించారని కొనియాడారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు .రామోజీ మరణం తెలుగు వారికి తీరని నష్టమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. పత్రికా రంగంలో, వ్యాపార రంగాలలో తనదైన ముద్ర వేశారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన చరిత్ర రామోజీరావుది.
దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయనను అక్షర యోధుడిగా కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.