ENTERTAINMENT

రామోజీ మృతి తీర‌ని లోటు

Share it with your family & friends

నిర్మాత చ‌ల‌సాని అశ్వ‌నీ ద‌త్

హైద‌రాబాద్ – ఈనాడు సంస్థ‌ల చైర్మ‌న్ చెరుకూరి రామోజీ రావు మృతి ప‌ట్ల దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు ప్ర‌ముఖ సినీ నిర్మాత చ‌ల‌సాని అశ్వ‌నీ ద‌త్. శ‌నివారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

ఏ రంగంలో అయినా, ఎలాంటి నేప‌థ్యం లేక పోయినా క‌ష్ట ప‌డితే చాలు.విజ‌యం ద‌క్కుతుందని ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించిన అరుదైన వ్య‌క్తి రామోజీరావు అని కొనియాడారు. ఆయ‌న నాలాంటి వారికే కాదు ల‌క్ష‌లాది మందికి స్పూర్తి దాయ‌కంగా మారార‌ని పేర్కొన్నారు చ‌ల‌సాని అశ్వ‌నీ ద‌త్.

ఆయ‌న చూపిన మార్గం, ఇచ్చిన స్పూర్తి ఎల్ల కాలం నిలిచే ఉంటుంద‌ని పేర్కొన్నారు. తెలుగు నాట జ‌న్మించిన గొప్ప మాన‌వుడంటూ కీర్తించారు. ఆయ‌న జ‌న్మ ధ‌న్య‌మైంద‌ని ప్ర‌శంసించారు.

తెలుగు కీర్తిని, స్ఫూర్తిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన రామోజీరావు మ‌ర‌ణం ఈ దేశానికి, ముఖ్యంగా తెలుగు జాతికి తీర‌ని లోటు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్. అక్ష‌ర యోధుడిగా, ఈనాడు సంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడిగా, ప్రియా రుచుల‌ను ప‌రిచ‌యం చేసిన వ్య‌క్తిగా ఇలా అన్ని రంగాల‌లో త‌న‌కు తానే సాటి అని నిరూపించుకున్నార‌ని పేర్కొన్నారు.