ఆత్మీయుడిని కోల్పోయా – వెంకయ్య
రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలి
హైదరాబాద్ – ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామాజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు . శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. రామోజీరావు లేని లోటు తీర్చ లేనిదని పేర్కొన్నారు. ఒక రకంగా తను ఆత్మీయుడిని, సోదరుడిని కోల్పోయానంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఆయన మృతితో ఒక శకం ముగిసిందన్నారు. ఆయన వ్యక్తి కాదు సంస్థ కంటే ఎక్కువ అని స్పష్టం చేశారు. తామిద్దరి మధ్య పలుమార్లు చర్చలు జరిగాయని, ఇందులో అనేక అంశాలు ముందుకు వచ్చాయని తెలిపారు.
అక్షరాలతో తెలుగు సమాజాన్ని చైతన్యవంతం చేశాడని, రాజకీయాలను శాసించాడని పేర్కొన్నారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఈనాడుతో ప్రతి తెలుగు వారి కుటుంబంలో ఒకడిగా మారి పోయిన చరిత్ర ఆయనదని పేర్కొన్నారు.
ప్రజల హృదయాలకు వేదికగా నిలిచిందని కొనియాడారు వెంకయ్య నాయుడు. రామోజీ ఫిల్మ్ సిటీని రూపొందించి, అభివృద్ధి చేసిన దార్శనికుడిగా, మార్గదర్శి చిట్ ఫండ్స్ వంటి ఆర్థిక సంస్థల స్థాపకుడిగా, సినీ నిర్మాతగా, పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా రామోజీరావు పేరు పొందారంటూ తెలిపారు.