ENTERTAINMENT

రామోజీకి రామ్ చ‌ర‌ణ్..శంక‌ర్ నివాళి

Share it with your family & friends

ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలి

హైద‌రాబాద్ – ఈనాడు సంస్థ‌ల చైర్మ‌న్ చెరుకూరి రామోజీరావు మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు ప్ర‌ముఖ న‌టుడు రామ్ చ‌ర‌ణ్ , దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ . ఆయ‌న న‌టిస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో కొన‌సాగుతోంది.

రామోజీ రావు మృతి చెందార‌న్న వార్త తెలిసిన వెంట‌నే ద‌ర్శ‌కుడు, న‌టుడితో పాటు ఇత‌ర సాంకేతిక సిబ్బందికి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్బంగా ఇవాళ ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుతూ షూటింగ్ నిలిపి వేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు న‌టుడు రామ్ చ‌ర‌ణ్. ఇదిలా ఉండ‌గా ఈనాడు సంస్థ‌ల‌తో పాటు ప్రియా ఫుడ్స్ , క‌ళాంజ‌లి, మార్గ‌ద‌ర్శి , త‌దిత‌ర రంగాల‌లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చారు రామోజీరావు.

శ‌నివారం తెల్ల వారు జామున తుది శ్వాస విడిచారు చెరుకూరి రామోజీరావు. ఆయ‌న మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి, ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి సంతాపం వ్య‌క్తం చేశారు.