రామోజీ రావు యుగ పురుషుడు
పవన్ కళ్యాణ్ ప్రగాఢ సంతాపం
హైదరాబాద్ – రామోజీ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అక్షరాలతో సమాజాన్ని మార్చ వచ్చని నిరూపించిన అరుదైన వ్యక్తి అని కొనియాడారు.
ఆయన అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ఈనాడు పత్రికాధిపతిగా, టీవీ చీఫ్ గా , ప్రియా, మార్గదర్శి, రామోజీ సంస్థలను ఏర్పాటు చేయడమే కాదు విజయవంతంగా నడిపించిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయంగా ఉంటుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు, తెలుగు వారికి ప్రత్యేకించి దేశానికి తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడిగా జీవితం ప్రారంభించి మహోన్నతమైన వ్యక్తిగా, సంస్థగా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ స్పూర్తి దాయకంగా ఉంటుందన్నారు.
అందరికీ రామోజీరావు పెద్దాయనగా గుర్తింపు పొందారని కొనియాడారు పవన్ కళ్యాణ్. కోట్లాది మందికి స్పూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు.