రామోజీ మరణం రాహుల్ సంతాపం
మీడియా, వినోద రంగానికి తీరని లోటు
హైదరాబాద్ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ మీడియా మొఘల్ రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. ఈనాడు పత్రికనే కాకుండా ఇతర రంగాలలో కూడా రాణించారని కొనియాడారు.
రామోజీ సంస్థల చైర్మన్ రామోజీరావు పూర్తి పేరు చెరుకూరి రామయ్య. ఆయన తర్వాత రామోజీరావుగా మార్చుకున్నారు. 1974లో ఈనాడు పత్రికను విశాఖ పట్టణంలో ప్రముఖ పాత్రికేయుడు , సంపాదకుడు ఏబీకే ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
చెరుకూరి రామోజీ రావు స్వస్థలం ఆంధ్రప్రేదశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. 16 నవంబర్ 1936లో పుట్టారు. శనివారం తెల్ల వారుజుమున హైదరాబాద్ లో కన్ను మూశారు. భారత దేశంలో మీడియా మొఘల్ గా పేరు పొందారు.
వ్యాపార, వాణిజ్య వేత్తగా రాణించారు. రామోజీ సంస్థలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని విజయవంతంగా నడిపించారు. ప్రపంచంలోనే అతి పెద్ద చలన చిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు.