రామోజీ మరణం బాధాకరం
మాజీ మంత్రి కేటీఆర్ , సబితా
హైదరాబాద్ – మీడియా, వినోద రంగంలో చెరుకూరి రామోజీ రావు గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు మాజీ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి , ఇవాళ ఆయన లేక పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. . రామోజీ ఫిలిం సిటీలో రామోజీ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
తెలుగు భాష పట్ల రామోజీ రావుకు ఉన్న మమకారం గొప్పందన్నారు. ఆయన వ్యక్తి కాదు శక్తి అని కొనియాడారు. ఆయన మరణం ఇరు తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు .
చాలా సార్లు రామోజీరావుతో కలిసే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. ఈ సందర్బంగా తామిద్దరం అనేక అంశాలపై చర్చించామని, పలు సూచనలు చేశారని కొనియాడారు కేటీఆర్. పత్రికా పరంగా రామోజీ రావు తీసుకు వచ్చిన సంస్కరణలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా రామోజీ సంస్థల చైర్మన్ రామోజీరావు పూర్తి పేరు చెరుకూరి రామయ్య. 1974లో ఈనాడు పత్రికను విశాఖ పట్టణంలో ప్రముఖ పాత్రికేయుడు , సంపాదకుడు ఏబీకే ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
చెరుకూరి రామోజీ రావు స్వస్థలం ఆంధ్రప్రేదశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. 16 నవంబర్ 1936లో పుట్టారు. భారత దేశంలో మీడియా మొఘల్ గా పేరు పొందారు.