NEWSNATIONAL

మీడియా రంగాన్ని శాసించిన రామోజీ

Share it with your family & friends

ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌న్న ఖ‌ర్గే

న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే మీడియా మొఘ‌ల్ రామోజీ రావు మృతిపై స్పందించారు. ఆయ‌న మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు. భార‌తీయ , తెలుగు ప‌త్రికా, ప్ర‌సార రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకు వ‌చ్చార‌ని కొనియాడారు .

సినీ నిర్మాత‌గా , మీడియా సంస్థ‌ల అధిప‌తిగా , వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌ల చీఫ్ గా రామోజీరావు చేసిన ప్ర‌య‌త్నం గొప్ప‌ద‌న్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. అక్ష‌ర దోషాల‌ను ప‌సిగ‌ట్టి , అక్ష‌రాల‌కు కూడా ప్ర‌యారిటీ ఇచ్చేలా చేసిన ఘ‌న‌త రామోజీరావు అని కొనియాడారు.

ఆయ‌న మృతి మీడియా రంగానికి తీర‌ని లోటుగా పేర్కొన్నారు. రామోజీ మ‌ర‌ణం విచార‌క‌ర‌మ‌ని, త‌న‌ను బాధ‌కు గురి చేసింద‌ని పేర్కొన్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు. రామోజీ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ చేశారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.

రామోజీరావు పొలిటిక‌ల్ కార్టూన్ల‌ను ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త కూడా రామోజీరావుదేన‌ని కొనియాడారు .